JD Vance | చర్చలు విఫలమవడం మాకు బ్యాడ్ న్యూస్.. ఇరాన్‌కు మాకంటే ఎక్కువ బ్యాడ్ న్యూస్ : అమెరికా వైస్ ప్రెసిడెంట్.. Video
JD Vance | పాకిస్థాన్ (Pakistan) రాజధాని ఇస్లామాబాద్ (Islamabad) వేదికగా అమెరికా-ఇరాన్ (USA- Iran) దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. దాంతో అమెరికా ఉపాధ్యక్షుడు (US Vice President) జేడీ వాన్స్ (JD Vance) టీమ్ అర్ధాంతరంగా అమెరికాకు తిరిగి వెళ్లిపోయింది. దాదాపు 21 గంటలపాటు సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల్లో ఇరుదేశాల మధ్య ఎలాంటి అంగీకారం కుదరగలేదు.
JD Vance : పాకిస్థాన్ (Pakistan) రాజధాని ఇస్లామాబాద్ (Islamabad) వేదికగా అమెరికా-ఇరాన్ (USA- Iran) దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. దాంతో అమెరికా ఉపాధ్యక్షుడు (US Vice President) జేడీ వాన్స్ (JD Vance) టీమ్ అర్ధాంతరంగా అమెరికాకు తిరిగి వెళ్లిపోయింది. దాదాపు 21 గంటలపాటు సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల్లో ఇరుదేశాల మధ్య ఎలాంటి అంగీకారం కుదరగలేదు. జేడీ వాన్స్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. చర్చలు విఫలం కావడం అనేది రెండు దేశాలకు బ్యాడ్ న్యూస్ అని వాన్స్ పేర్కొన్నారు.
చర్చలు ముగిసిన అనంతరం వాన్స్ ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తాము 21 గంటలపాటు నిరంతాయంగా ఇరాన్‌తో చర్చలు జరిపామని ఆయన అన్నారు. అనేక కీలకమైన విషయాలపై చర్చించినట్లు వెల్లడించారు. అయితే ఈ చర్చల్లో ఎలాంటి ఒప్పందానికి రాలేకపోయామని చెప్పారు. ఒప్పందానికి అనుకూలంగా తాము షరతలు విధించామని.. కానీ వాటిని ఇరాన్ ప్రతినిధులు అంగీకరించలేదని తెలిపారు. చర్చల్లో తాము చాలా సానుకూలంగా వ్యవహరించామని, సద్భావనతో ఇక్కడికి వచ్చి ఒక ఒప్పందం చేసుకునేందుకు తమవంతు ప్రయత్నం చేశామని అన్నారు.
చర్చలు విఫలం కావడం అనేది తమకు బ్యాడ్ న్యూస్ అని, కానీ అంతకంటే ఎక్కువగా అది ఇరాన్‌కు బ్యాడ్ న్యూస్ అని వాన్స్ చెప్పారు. భవిష్యత్తులో ఇరాన్ తన అణ్వాయుధాలను సమకూర్చుకోవడానికి, అభివృద్ధి చేయడానికి ప్రయత్నించకుండా ఉంటాననే స్పష్టమైన హామీని అమెరికా కోరుతోందని, అయితే అందుకు ఇరాన్ నిరాకరించిందని వాన్స్ తెలిపారు. ఎలాంటి ఒప్పందం కుదరనప్పటికీ.. తమ ప్రతిపాదనపై స్పందించేందుకు ఇరాన్‌కు ఇంకా సమయం ఇవ్వనున్నట్లు చెప్పారు. పాకిస్థాన్‌లో చర్చలపై అధ్యక్షుడు ట్రంప్‌తో తాము నిరంతరం ఫోన్లో మాట్లాడుతున్నామని అన్నారు. అనంతరం వాన్స్ బృందం అమెరికాకు తిరిగి వెళ్లిపోయింది.
#WATCH | US-Iran Peace Talks | Pakistan: US Vice President JD Vance leaves from Islamabad after the US and Iran failed to reach an agreement.
In a press conference, the US Vice President said, “…The bad news is that we have not reached an agreement. I think that is bad news… pic.twitter.com/h4HfeNcSDp
— ANI (@ANI) April 12, 2026
అయితే అమెరికాతో శాంతి చర్చలు విఫలమవడంపై ఇరాన్ స్పందించింది. హర్మూజ్ జలసంధి, ఇరాన్ అణు హక్కులు వంటి కీలక అంశాలపై ప్రతిష్ఠంభన కారణంగానే చర్చలు విఫలమయ్యాయని ఇరాన్ మీడియా పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

