టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో గ్వాడలూప్ నది ఉప్పొంగడంతో, వరదలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వేసవి శిక్షణ శిబిరాలు వరదలో చిక్కుకున్నాయి. మృతుల సంఖ్య 82కు చేరింది, సుమారు 41 మంది గల్లంతయ్యారు. కెర్ కౌంటీలో మరణించినవారిలో 40 మంది పెద్దలు, 28 మంది చిన్నారులు ఉన్నారు.
ఈ నెల 4న కేవలం నిమిషాల వ్యవధిలోనే వరద ఉధృతమైంది. దీంతో కొన్ని రోడ్లు మాయమయ్యాయి. గల్లంతైనవారిలో 10 మంది బాలికలు, ఓ కౌన్సిలర్ ఉన్నారు. వీరందరి కోసం అధికారులు గాలిస్తున్నా రు. 850 మందిని కాపాడినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ వరద ప్రభావి త ప్రాంతాల్లో పర్యటించనున్నారు.