న్యూయార్క్: ‘నాసా’ ఇంటర్నేషనల్ ఎయిర్, స్పేస్ ప్రోగ్రాం పూర్తిచేసుకున్న తొలి భారతీయురాలిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దాంజిటి జాహ్నవి వార్తల్లో నిలిచారు. తద్వారా అమెరికా 2029లో చేపట్టబోయే రోదసి యాత్రకు సిద్ధమవుతున్నారు. ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తిచేసిన జాహ్నవి నాసా స్పేస్ ప్రోగ్రాంను డిస్టింక్షన్లో విజయవంతంగా పూర్తి చేసిన తొలి భారతీయురాలిగా గుర్తింపు అందుకున్నారు.
రాబోయే నాలుగేండ్లలో అమెరికా ప్రారంభించనున్న ‘టైటాన్స్ ఆర్బిటల్ పోర్ట్ స్పేస్ స్టేషన్’ ప్రయాణానికి ఆమె ఎంపికయ్యారు. అంతరిక్ష శోధనపై అమితమైన ఆసక్తి కలిగిన జాహ్నవి పాలకొల్లులో ఇంటర్ చదివారు.