పారిస్: రష్యా బిలియనీర్, టెలిగ్రాం మెసేజింగ్ యాప్ ఫౌండర్ పావెల్ దురోవ్(Pavel Durov)ను పారిస్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 39 ఏళ్ల పావెల్ అరెస్టు నేపథ్యంలో.. ప్రస్తుతం ఆన్లైన్లో భావ స్వేచ్ఛ గురించి డిబేట్ నడుస్తోంది. ఇంటర్నెట్లో అక్రమ కాంటెంట్ గురించి కూడా చర్చిస్తున్నారు. మనీల్యాండరింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, ఫెడోఫైల్ కాంటెంట్‌ను టెలిగ్రాం ఫ్లాట్‌ఫామ్ ద్వారా ట్రాన్సఫర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ యాప్‌కు సుమారు 90 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. చాలా వరకు దేశాల్లో టెలిగ్రాం యాప్‌ను కీలక సమాచార వారధిగా వాడుతున్నారు. చాటింగ్ నుంచి ప్రభుత్వ మెసేజ్‌ల వరకు ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు.
కాంటెంట్ ఆధారంగా ఎలా ఓ కంపెనీ బాస్‌ను అరెస్టు చేస్తారని ఆన్లైన్లో చర్చ సాగుతున్నది. దీనిపై టెలిగ్రాం సంస్థ ఓ ప్రకటన జారీ చేసింది. అనైతికం అంటూ ఆ ప్రకటనలో ఆరోపించింది. టెలిగ్రాం లాంటి ఎన్‌క్రిప్ట్ కమ్యూనికేషన్ యాప్స్ కొందరికి ఫ్రీ స్పీచ్‌గా పనిచేస్తాయని, కొందరికి డార్క్ వెబ్‌గా ఉంటాయని బీడీఏ టెక్నాలజీ నిపుణుడు డంకన్క్లార్క్ తెలిపారు. టెలిగ్రాం యాప్ ద్వారా హైలెవల్ ఎన్క్రిప్షన్ జరుగుతుంది. అయితే యూజర్లు ఆ పోస్టులో ఏం ఉందో కూడా ఎక్కువగా తెలియకుండా పోతుంది. దీని వల్ల నకిలీ, కుట్రపూరిత, ద్వేషపూరిత, హానికర కాంటెంట్ గురించి తెలియకుండా పోతుంది.
భావస్వేచ్ఛపై ఆంక్షలు ఉన్న రష్యా, ఇరాన్ లాంటి దేశాల్లో ఈ యాప్‌కు పాపులారిటీ ఉన్నది. శ్వేతజాతీయులు, ఉగ్ర గ్రూపులు కూడా ఈ ఫ్లాట్‌ఫామ్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఉక్రెయిన్‌లో టెలిగ్రాం యాప్ చాలా పాపులరైంది. న్యూస్ షేరింగ్‌కు ఇదే కీలకంగా మారింది. యుద్ధం, ఎయిర్ రెయిడ్స్ గురించి వార్నింగ్ ఇవ్వడానికి ఈ యాప్‌ను ఎక్కువగా వాడుకున్నారు. ఫ్లాట్‌ఫామ్‌ను దుర్వినియోగం చేస్తే దాంట్లో ఓనర్ బాధ్యత ఏం ఉంటుందని దురోవ్ తెలిపారు.
రష్యాకు చెందిన మార్క్ జుకర్‌బర్గ్‌గా దురోవ్‌ను పోలుస్తారు. 2013లో సోదరుడు నికోలైతో కలిసి టెలిగ్రాం యాప్‌ను ఆవిష్కరించాడు. బ్లూమ్‌బర్గ్ ప్రకారం ఇప్పుడు ఆ సంస్థ విలువ 9.15 బిలియన్ల డాల్లు. రష్యాలో పుట్టినా.. 2014లో ఆ దేశాన్ని విడిచి వెళ్లాడు.