Online games | తల్లి ఖాతాలోని రూ.52 లక్షలు ఖాళీచేసి ఆన్లైన్ గేమ్‌లు
ఆధునిక కాలంలో జూదానికంటే వేల రెట్లు ప్రమాదకరంగా ఆన్లైన్ గేమ్‌లు మనుషులను బానిసలుగా మారుస్తున్నాయి. ఆన్లైన్ ఆటలకు అలవాటపడ్డవారు ఎంతకైనా తెగిస్తారని చైనాలో జరిగిన ఘటన తెలియజేస్తోంది. ఎన్నో ఏండ్లుగా భవిష్యత్ అవసరాల కోసం తల్లి దాచిన ఖాతాలోని రూ.52 లక్షలను 13 ఏండ్ల బాలిక అపహరించి ఆన్లైన్ గేమ్‌లు ఆడి పోగొట్టుకుంది. ఆ దేశానికి చెందిన బాలిక ఆన్లైన్ గేమ్‌లకు బానిసగా మారింది.
Online games | బీజింగ్: ఆధునిక కాలంలో జూదానికంటే వేల రెట్లు ప్రమాదకరంగా ఆన్లైన్ గేమ్‌లు మనుషులను బానిసలుగా మారుస్తున్నాయి. ఆన్లైన్ ఆటలకు అలవాటపడ్డవారు ఎంతకైనా తెగిస్తారని చైనాలో జరిగిన ఘటన తెలియజేస్తోంది. ఎన్నో ఏండ్లుగా భవిష్యత్ అవసరాల కోసం తల్లి దాచిన ఖాతాలోని రూ.52 లక్షలను 13 ఏండ్ల బాలిక అపహరించి ఆన్లైన్ గేమ్‌లు ఆడి పోగొట్టుకుంది. ఆ దేశానికి చెందిన బాలిక ఆన్లైన్ గేమ్‌లకు బానిసగా మారింది.
నిత్యం ఫోన్లో పే-టు-ప్లే గేమ్స్ ఆడుతూ తల్లి బ్యాంక్ అకౌంట్లోని 449,500 యువాన్లు (భారత కరెన్సీలో 52.19 లక్షల రూపాయలు) కేవలం నాలుగు నెలల్లోనే పోగొట్టుకుంది. బాలిక ఎప్పుడూ ఫోన్లో గేమ్‌లు ఆడుతూ ఉండటాన్ని గమనించిన స్కూల్ టీచర్ ఆమె తల్లి వాంగ్‌కు విషయాన్ని తెలియజేసింది. ఎందుకో అనుమానం వచ్చి చూస్తే కూతురు తన బ్యాంక్‌లోని 52 లక్షల రూపాయలకు పైగా అపహరించి గేమ్‌లు ఆడినట్టు తెలిసి లబోదిబోమంది. ఇప్పుడు ఆమె అకౌంట్లో కేవలం 5 రూపాయలు మాత్రమే ఉన్నాయి. మొబైల్ గేమ్ కంపెనీలకు చేసిన చెల్లింపులకు సంబంధించి పాస్‌బుక్‌లో నమోదైన ఎంట్రీలను చూపుతూ కూతురి నిర్వాకం గురించి ఆ తల్లి కన్నీటి పర్యంతమవుతున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ బాలిక తనకే కాక, తన స్నేహితులకు కూడా తల్లి ఖాతా నుంచే డబ్బులు చెల్లిస్తూ గేమ్‌లు ఆడటం శోచనీయం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

