Software Employees | న్యూయార్క్, మే 1: ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల ఊచకోత కొనసాగుతున్నది. ఈ ఏడాది ఇప్పటివరకు 51,028 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
‘లేఆఫ్.ఎఫ్‌వైఐ’ వెబ్సైట్ కథనం ప్రకారం, దాదాపు 112 టెక్ కంపెనీలు దశల వారీగా ఈ ఉద్యోగాల కోతను చేపట్టాయి. 2025లో పెద్ద సంఖ్యలో లేఆఫ్‌లు అమలుజేసిన కంపెనీల్లో మెటా, గూగుల్, ఇంటెల్ తదితర దిగ్గజ సంస్థలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చినాటికి 27,560 మందిని తొలగించగా, ఒక్క ఏప్రిల్‌లోనే 23,468 మందిపై వేటు వేశాయి.