పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. తాలిబన్ల పనే అన్న ఇమ్రాన్‌ఖాన్

క్వెట్టా: పాకిస్థాన్‌లోని క్వెట్టాలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. 20 మంది వరకూ గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రీకె తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) వెల్లడించింది. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాకు 25 కిలోమీటర్లు దక్షిణంగా.. క్వెట్టా-మాస్తంగ్ రోడ్డులోని చెక్‌పాయింట్ దగ్గర ఈ దాడి జరిగింది. చెక్‌పోస్ట్ దగ్గర ఉన్న పోలీసులపైకి ఓ వ్యక్తి బైక్‌పై దూసుకొచ్చి తనను తాను పేల్చేసుకున్నాడని, ఈ పేలుడులో ముగ్గురు పారామిలిటరీ సిబ్బంది మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. టీటీపీ దాడిని ఖండిస్తున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చెప్పారు. ఈ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. బలూచిస్తాన్ హోంమంత్రి మీర్ జియావుల్లా కూడా ఈ దాడిని ఖండించారు.
Condemn the TTP suicide attack on FC checkpost, Mastung road, Quetta. My condolences go to the families of the martyrs & prayers for the recovery of the injured. Salute our security forces & their sacrifices to keep us safe by thwarting foreign-backed terrorists' designs.
— Imran Khan (@ImranKhanPTI) September 5, 2021
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,109 పాయింట్లు లాభం
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో అవగాహణ ఎంతో అవసరం
Jatayu | ‘రామాయణం’లో జటాయువుగా అనుపమ్ ఖేర్!
CPR | సీపీఆర్ అంటే ఏమిటి.. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఇది ఎందుకు కీలకం..
రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు భీమవరం విద్యార్థినులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

