Afghanistan | కాబూల్: అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం తాజాగా చదరంగంపై దేశవ్యాప్తంగా నిషేధం విధించింది. క్రీడల డైరెక్టరేట్ అధికార ప్రతినిధి అటల్ మష్వానీ మాట్లాడుతూ, షరియా దృష్టిలో చదరంగం అంటే జూదం అని తెలిపారు.
గత ఏడాది నుంచి అమలవుతున్న ‘నైతికత వృద్ధి, అనైతికత నిరోధక చట్టం’ ప్రకారం చదరంగంపై నిషేధం విధించినట్లు చెప్పారు. చదరంగం క్రీడకు సంబంధించి ఇవి మతపరమైన భావనలని వివరించారు. ఈ భావనలను పరిగణనలోకి తీసుకునే వరకు చదరంగం క్రీడను దేశవ్యాప్తంగా నిషేధిస్తున్నట్లు వివరించారు.