న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు (Talibans)పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ దేశ విదేశాంగ మంత్రి తొలిసారిగా భారత్‌లో పర్యటించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ పునరుద్ధరించాయి. అయితే దీనిపై దాయాది పాకిస్థాన్ (Pak Afghan Clashes) తన అక్కసును వెళ్లగక్కింది. తాలిబన్లు భారత్‌కు దగ్గరవుతుండటంతో ఆగ్రహించిన పాక్ పాలకులు తమ సైన్యాన్ని ఉసిగొల్పారు. అఫ్ఘాన్‌లోని (Afghanistan) కాందహార్ ప్రావిన్సు, పాక్‌లోని బలోచిస్థాన్ ప్రాంతం మధ్య ఉన్న కీలక సరిహద్దు జిల్లా స్పిన్ బోల్దక్‌లో (Spin-Boldak) మంగళవారం అర్ధరాత్రి పాక్ సైనికులు దాడులకు పాల్పడ్డారు. దీంతో 15 మంది మరణించగా, 100 మందికిపైగా గాయపడ్డారని అఫ్ఘాన్ పాలకులు ప్రకటించారు.
దీనికి ప్రతిగా తాలిబన్ బలగాలు పాక్ సైనికులపై దాడులకు దిగాయి. పాకిస్థాన్‌లోని చమన్ జిల్లా, అఫ్ఘాన్‌లోని బోల్దక్ జిల్లాలో ఉభయ దేశాలకు చెందిన సైనిక దళాలు పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. మరోవైపు స్పిన్ బోల్దక్‌లో తమ సైనిక స్థావరాలపై దాడి చేసేందుకు పాక్ సైన్యం ఉపయోగించిన యుద్ధ ట్యాంకును స్వాధీనం చేసుకున్న తాలిబన్ బలగాలు, పాక్ సైనిక ఔట్‌పోస్టుపై మెరుపు దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా పాక్ సైనికులు పరారైనట్లు, కొంత మందిని బంధించినట్లు, భారీగా ఆయుధాలు, ఆహార పదార్థాలను స్వాదీనం చేసుకున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
తాజాగా ఆ వార్తలు నిజమేనని, తమ దెబ్బకు పాక్ సైనికులు పరారయ్యారని తాలిబన్ సైన్యం నిరూపించింది. తాము స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, ఆహార పదార్థాలు, పాక్ సైనికుల దుస్తులు, ఇతర సామాగ్రిని అఫ్ఘాన్ సైనికులు నంగర్హార్ ప్రావిన్స్‌లో బహిరంగంగా ప్రదర్శించారు. పాక్ సైనికుల ప్యాంట్లను ప్రదర్శిస్తూ.. ఆ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ దృష్యాలను అఫ్ఘానిస్థాన్లోని బీబీసీ జర్నలిస్టు దౌద్ జున్బిష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా పాక్ సైన్యం విడిచిపెట్టిన అవుట్‌పోస్టుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ప్యాంట్లను తాలిబాన్ ప్రదర్శిస్తున్నదని ఆయన రాసుకొచ్చారు. ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
🏳️🚨 BIG BREAKING from Afghanistan
“Afghans celebrated with joyous gatherings to honor their soldiers after the Afghan forces gave a crushing response to Pakistan.” pic.twitter.com/YhfhPm83je
— Afghanistan Defense (@AFGDefense) October 13, 2025
కాగా, కాబూల్, కాంహార్పై పాక్ దాడులతో రగిలిపోతున్న అఫ్ఘాన్ ప్రజలు తాలిబన్లకు మద్దతుగా నిలిచారు. అవసరమైతే తాము కూడా ముజాహిదీన్‌గా మారిపోయి యుద్ధానికి సిద్ధమని కాందహార్ యువకులు చెబుతున్నారు. ఇస్లామిక్ ఎమిరేట్ (తాలిబాన్ తాత్కాలిక ప్రభుత్వం) సరైన ప్రతీకారం తీసుకుందని, ప్రజలంతా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా తాలిబాన్‌తో ఉన్నారని కాందహార్‌కు చెందిన మోహిబుల్లా అనే వ్యక్తి అన్నారు. తమ భూమిని రక్షించిన భద్రతా బలగాలకు కృతజ్ఞతలని, తాము ఎల్లప్పుడూ వారి పక్కనే ఉంటామని పక్తియాకు చెందిన బైతుల్లా చెప్పారు.
The Afghan Taliban is celebrating victory over Pakistan. Their trophy? Pakistani pants and rifles. Free fashion show in Afghan cities.🤪@RealWahidaAFG#Pakistan #Afganistan pic.twitter.com/Q9XeNAl2YN
— TridentX™ (@TridentxIN) October 14, 2025
అఫ్ఘాన్, పాకిస్థాన్ మధ్య ఘర్షణలకు తాత్కాలికంగా తెరపడింది. 48 గంటల పాటు కాల్పుల విరమణ పాటించాలని రెండు దేశాలు నిర్ణయించాయి. తాజా ఘర్షణలతో రెండు దేశాల సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు పాక్ చర్చల ప్రక్రియ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకు తాత్కాలికంగా 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకున్నట్లు పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది.
ఒకనాటి మిత్రులైన పాక్, అఫ్ఘాన్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడం, చర్చల కోసం పాక్ మంత్రులు తమ దేశంలోకి ప్రవేశించడానికి అఫ్ఘాన్ అనుమతించకపోవడంతో మధ్యవర్తిత్వం వహించాలని పాక్ ప్రభుత్వం ఖతార్, సౌదీ అరేబియాకు అంతకుముందు విజ్ఞప్తి చేసింది.