డుషంబే (తజికిస్థాన్), జూన్ 21: హిజాబ్‌తో పాటు ఇతర ఇస్లాం సంప్రదాయ దుస్తుల ధారణపై తజికిస్థాన్ నిషేధం విధించింది. వివాదాస్పదమైన ఈ బిల్లుకు ఆ దేశ పార్లమెంట్ బుధవారం ఆమోదం తెలిపింది. మాజీ సోవియట్ రిపబ్లిక్ దేశమైన తజికిస్థాన్‌లోని అత్యధిక ముస్లిం జనాభాలో ఈ బిల్లు అలజడిని కలిగించింది.
అంతేకాకుండా తజికిస్థాన్‌తో సరిహద్దును పంచుకుంటున్న తాలిబన్ పాలనలోని అఫ్గానిస్థాన్ సహా పలు ముస్లిం దేశాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమయ్యే అవకాశం ఉంది.