Crime news : తైవాన్ (Taiwan) రాజధాని తైపీ (Taipei) లో ఓ దుండగుడు కిరాతకానికి పాల్పడ్డాడు. శుక్రవారం సాయంత్రం పొగ బాంబులు విసురుతూ, ఎదురుపడిన వారినల్లా కత్తితో పొడుస్తూ బీభత్సం సృష్టించాడు. తైపీ నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్ సమీపంలోగల సబ్వే వద్ద ప్రయాణికులపై దాడికి దిగాడు.
దుండగుడి దాడిలో మొత్తం 14 మంది కత్తిపోట్లకు గురయ్యారు. వారిలో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మిగతా 11 మంది చికిత్స పొందుతున్నారు. కాగా దాడి అనంతరం దుండగుడు పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేందుకు ఎత్తయిన భవనం పైనుంచి దూకాడు. తీవ్రంగా గాయపడి మరణించాడు.