డమాస్కస్: సిరియా రాజధాని డమాస్కస్, దాని పరిసర ప్రాంతాలపై ఇజ్రాయెల్ సైన్యం శనివారం విరుచుకుపడింది. బ్రిటన్లోని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, కొండ కింద, భూగర్భంలో ఉన్న మిసైల్ బంకర్లు, రాకెట్లు, ఆయుధ డిపోలు, సొరంగాలను ఇజ్రాయెల్ వాయు సేన ధ్వంసం చేసింది.
కలమున్లోని గోదాములు, మిసైల్ లాంచర్లను సర్వ నాశనం చేసింది. బార్జేహ్లోని మిలిటరీ, సైంటిఫిక్ కేంద్రాలపై, డమాస్కస్ శివారులో ఉన్న సైనిక విమానాశ్రయంపై దాడులు జరిగాయి.