Ready for War | స్టాక్హోమ్: యుద్ధం సంభవిస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తమ దేశాల పౌరులకు స్వీడన్, ఫిన్లాండ్ సూచిస్తున్నాయి. యుద్ధం, ప్రకృతి విపత్తులు, సైబర్ దాడి వంటి సంక్షోభాలు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో చెప్తూ ప్రజలకు 52 లక్షల బుక్లెట్లను స్వీడన్ పంపిణీ చేస్తున్నది. 32 పేజీలతో ఈ బుక్లెట్ ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇలాంటి బుక్లెట్లను స్వీడన్ ఐదుసార్లు ప్రజలకు పంపిణీ చేసింది.
మరోవైపు ఫిన్లాండ్ కూడా సంక్షోభాలకు ప్రజలను సంసిద్ధం చేసేందుకు ఒక ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించింది. స్వీడన్, ఫిన్లాండ్ అనేక దశాబ్దాలుగా సైనిక అలీన విధానాన్ని పాలిస్తూ వచ్చాయి. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో నాటో కూటమిలో చేరేందుకు ఇటీవలే ఈ విధానాన్ని మార్చుకున్నాయి.