న్యూయార్క్: అగ్రరాజ్యమైన అమెరికాకు మరోసారి షట్డౌన్ సంక్షోభం దూసుకొస్తున్నది. అమెరికా వార్షిక బడ్జెట్ ఇంతవరకు ఆమోదం పొందకపోవడంతో ప్రతిష్టంభన ఏర్పడి అమెరికాలో ప్రభుత్వ కార్యక్రమాల నిలిపివేత (షట్డౌన్) సంక్షోభం దిశగా వెళ్తోంది. బడ్జెట్ ఆమోదానికి నోచుకోకపోవడంతో పలు ప్రభుత్వ (అత్యవసర, నిత్యావసర మినహా) కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.