న్యూయార్క్: అమెరికాలోని మేరీల్యాండ్ వైద్యులు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 58 ఏండ్ల వ్యక్తికి విజయవంతంగా పంది గుండెను అమర్చారు. రెండు రోజుల్లోనే ఆ వ్యక్తి సాధారణంగా మాట్లాడటం గమనార్హం. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడిసిన్ వైద్య బృందం ఈ మేరకు అద్భుతం చేశారు. గతంలోనూ ఇదే వైద్య బృందం ఓ వ్యక్తికి గుండెను అమర్చడంలో సఫలం అయ్యారు.