వాషింగ్టన్: భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భూమి మీదకు తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం నాసా- స్పేస్ఎక్స్ శుక్రవారం క్రూ-10 మిషన్ చేపట్టాయి.
కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ను శుక్రవారం రోదసిలోకి పంపాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్, విల్మోర్ తొమ్మిది నెలలుగా చిక్కుకుపోయారు.