వాషింగ్టన్, మార్చి 13 : ఐఎస్ఎస్ నుంచి నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ల తిరుగు ప్రయాణం మళ్లీ వాయిదా పడింది. స్పేస్ఎక్స్ తలపెట్టిన ‘క్రూ-10’ మిషన్‌కు సంబంధించి రాకెట్ ప్రయోగం మరోమారు నిలిచిపోయింది. స్పేస్ఎక్స్ తయారుచేసిన ఫాల్కన్-9 రాకెట్లో సాంకేతిక లోపం తలెత్తటంతో గ్రౌండ్ సపోర్ట్ టీమ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో రాకెట్ లాంచింగ్‌ను నిలిపివేస్తున్నట్టు నాసా ప్రకటించింది. రాకెట్లో తలెత్తిన సమస్యపై పూర్తిస్థాయిలో సమీక్ష చేశాకే మళ్లీ రాకెట్ ప్రయోగం ఎప్పుడన్నది తేలుతుంది.