కాలిఫోర్నియా: నెల రోజులుగా వ్యాలీ ఫీవర్‌తో పోరాడిన తెలుగు టెక్ ప్రొఫెషనల్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ నెల 5న మృతి చెందాడు. అతడి వైద్య, కుటుంబ ఖర్చుల కోసం నిధులు సేకరిస్తున్న అతడి సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు చిరంజీవి కొల్ల(37)కి భార్య పావని, కుమారుడు విహాన్(5) ఉన్నారు.
ఏప్రిల్‌లో సాధారణ ఫ్లూ లక్షణాలు తీవ్రం కావడంతో చిరంజీవిని అత్యవసర వార్డుకు తరలించారు. కొన్ని రోజుల తర్వాత అతడు వ్యాలీ ఫీవర్‌తో బాధ పడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. 30 రోజులు అతడికి వెంటిలేటర్‌పై చికిత్స అందించినా.. చివరికి ఆ జబ్బుతో పోరాడలేక అతడు తుది శ్వాస విడిచాడు.
ఇది కాక్సిడియోయిడ్స్ అనే శిలీంధ్రం వల్ల కలిగే ఫంగల్ ఇన్ఫెక్షన్. ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. పొడి, దుమ్ము ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఈ శిలీంధ్రం మట్టిలో ఉంటుంది. గాలి లేదా నిర్మాణాలు, వ్యవసాయం వల్ల మట్టి కదిలినప్పుడు గాలిలోకి వ్యాపించి మనుషులకు సోకుతుంది.