వాషింగ్టన్ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడంపై తన ప్రభుత్వం దృష్టి పెడుతుందని అమెరికా ప్రెసిడెంట్ ఎలక్ట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పా రు. ఈ యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండటంపై ఆవేద న వ్యక్తం చేశారు. తన మర్-ఏ-లగో ఎస్టేట్‌లో జరిగిన కార్యక్రమం లో మాట్లాడుతూ, మిడిల్ ఈస్ట్‌లో ప్రశాంతత కోసం కృషి చేస్తామని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు కృషి చేస్తామన్నారు. మూడు రోజుల్లో వేలాది మంది మరణించారని ఓ నివేదిక పేర్కొందని చెప్పారు.