వాషింగ్టన్: అమెరికా పౌరసత్వం లేని విదేశీ వలసదారులకు జన్మించిన పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీచేసిన వివాదాదాస్పద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సుప్రీంకోర్టులో విచారణకు రానున్నది. ట్రంప్ జారీచేసిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వును గురువారం న్యూ హ్యాంప్షైర్లోని ఫెడరల్ కోర్టు నిలిపివేసింది. కోర్టు ఉత్తర్వు దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. అమెరికాలో చట్టవిరుద్ధంగా లేక తాత్కాలిక వీసాలతో నివసిస్తున్న వారికి పుట్టిన పిల్లలకు జన్మతః పౌరసత్వం లభించే చట్టాన్ని రద్దు చేస్తూ ఈ జనవరిలో ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీచేశారు. దీన్ని సవాల్ చేసిన పిటిషన్పై ఫెడరల్ జడ్జి గురువారం స్టే ఉత్తర్వులు జారీచేశారు. సుప్రీంకోర్టుకు అప్పీలు వెళ్లడానికి వీలుగా వారం రోజుల స్టే ఇచ్చింది.