న్యూఢిల్లీ: ప్రార్థనా మందిరాలపై 1991 చట్టంలో పొందుపరిచిన కొన్ని నిబంధనల చెల్లుబాటును ప్రశ్నిస్తూ పలువురు దాఖలు చేసిన కేసుకు సంబంధించి కేంద్రం తన వైఖరిని తెలియజేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ కేసును ముగ్గురు సభ్యుల బెంచ్ ఈ ఏడాది జూలై నుంచి విచారిస్తుందని చీఫ్ జస్టిస్ డీవై చండ్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాల ధర్మాసనం బుధవారం తెలిపింది. ఆ లోగా కేంద్రం తన సమాధానాన్ని దాఖలు చేయవచ్చునని తెలిపారు.