Stampede | ఆహార పంపిణీ కేంద్రంలో తొక్కిసలాట.. 12 మంది దుర్మరణం
పాకిస్థాన్‌లో దారుణం చోటుచేసుకున్నది. పాక్‌లోని పంజాబ్ (Punjab) ప్రావిన్స్‌లో ఫ్రీ పిండి పంపిణీ సందర్భంగా 11 మంది మరణించిన ఘటన మరువకముందే కరాచీలో (Ramzan) తొక్కిసలాట (Stampede) జరిగింది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో దారుణం చోటుచేసుకున్నది. పాక్‌లోని పంజాబ్ (Punjab) ప్రావిన్స్‌లో ఫ్రీ పిండి పంపిణీ సందర్భంగా 11 మంది మరణించిన ఘటన మరువకముందే కరాచీలో (Ramzan) తొక్కిసలాట (Stampede) జరిగింది. రంజాన్ సందర్భంగా ప్రభుత్వం ఆహార పదార్థాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నది. ఈ క్రమంలో కరాచీలోని (Karachi) ఓ ఆహార పంపిణీ కేంద్రం వద్ద (Food distribution centre) తొక్కిసలాటలో 12 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఆహారం పంపిణీ చేస్తుండగా కొందరు వ్యక్తులు అనుకోకుండా కరెంటు తీగపై కాలుపెట్టారు. దీంతో వారికి కరెంటు షాక్ తగిలించింది.

భయాందోళనకు గురైన ప్రజలు పరుగులు తీయడంతో తొలక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు. ఒకరినొకరు తోసుకోవడంతో కొందరు అక్కడున్న మురికికాలువలో పడ్డారని చెప్పారు. బాధితుల్లో ఎక్కువ మంది 40 నుంచి 50 ఏండ్లలోపున్న మహిళలే ఉన్నారని వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. రెండు రోజుల క్రితం పంజాబ్ ప్రావిన్స్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది.

Pak 2
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

