టెల్ అవీవ్: ఇజ్రాయెల్‌లో కత్తిపోటు దాడులు జరిగాయి. (stabbing attack in Israel) నాలుగు వేర్వేరు చోట్ల ఈ సంఘటనలు నమోదయ్యాయి. కత్తిపోటు దాడుల్లో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు. ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టగా అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. బుధవారం ఇజ్రాయెల్‌లోని హదేరా నగరంలో ఈ సంఘటన జరిగింది. నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో కత్తిపోటు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఆరుగురు గాయపడ్డారు. వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నదని చెప్పారు. కత్తిపోటు దాడులకు పాల్పడిన వారిలో ఒక ఉగ్రవాదిని హతమార్చగా మరో అనుమానిత వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కత్తిపోటు దాడికి సంబంధించి ఒక వీడియోను విడుదల చేశారు.
కాగా, ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసి ఏడాది గడిచింది. నాటి నుంచి గాజాపై దాడులను ఇజ్రాయెల్ కొనసాగిస్తున్నది. తాజాగా లెబనాన్‌లోని హెజ్బుల్లాతో కూడా ఇజ్రాయెల్‌కు వివాదం పెరుగుతున్నది. దీంతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో కత్తిపోటు దాడులు, కాల్పుల సంఘటనలు ఎక్కువవుతున్నాయి.