టొరంటో: మద్యం తాగేది మనుషులేనా? పెంపుడు జంతువులు కూడా తాగి ఎందుకు ఎంజాయ్ చేయకూడదు? అని ఆలోచించిన న్యూజిలాండ్‌లోని ఒక కంపెనీ ఏకంగా వాటి కోసం ఒక ప్రత్యేకమైన మద్యాన్ని తయారు చేసింది. కుక్కలు, పిల్లులకు ఈ మద్యాన్ని రాత్రి డిన్నర్ తర్వాత ఇస్తే వాటిలో దుందుడుకు స్వభావం నెమ్మదించి దాడికి దిగవని తెలిపింది.
ఆక్లాండ్ కేంద్రంగా ఉన్న మట్లీస్ ఎస్టేట్ అనే కంపెనీ ఈ మద్యం బ్రాండ్లకు పాట్, షాంపైన్, పర్ నోయిర్, సావిగ్నాన్ బార్క్ అని పేర్లు పెట్టింది. పెంపుడు జంతువుల మనస్థితిని మెరుగు పరిచే ఇవి నాన్ ఆల్కాలిక్ వైన్స్ అని, పూసగడ్డి లాంటి పదార్థాలతో వీటిని తయారు చేస్తారని తెలిపింది. యజమానులు పెంపుడు జంతువులకు కూడా చీర్స్ చెప్పుకుంటూ వేడుక చేసుకోవడానికి ఈ మద్యం ఉపకరిస్తుందని పేర్కొన్నది.