Watch: విమానం నుంచి రాలిపడిన నిప్పు రవ్వలు… తర్వాత ఏం జరిగిందంటే!
విమానంలో సాంకేతిక సమస్య వల్ల నిప్పు రవ్వలు రాలి పడినట్లు తెలుస్తున్నది. దీంతో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ దీనిపై దర్యాప్తు చేపట్టింది.
వాషింగ్టన్: గాల్లో ఎగురుతున్న విమానం నుంచి నిప్పు రవ్వలు రాలిపడ్డాయి. దీనిని చూసిన వారు తెగ భయపడ్డారు. అమెరికాలో ఈ సంఘటన జరిగింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777-200 విమానం న్యూయార్క్‌లోని నెవార్క్ నుంచి బ్రెజిల్‌లోని సావో పాలోకు బుధవారం టేకాఫ్ అయ్యింది. అయితే నెవార్క్ విమానాశ్రయం నుంచి పైకి ఎగిరిన వెంటనే ఆ విమానం నుంచి భారీగా నిప్పు రవ్వలు బయటకు వచ్చాయి. దీంతో పైలట్లు వెంటనే అప్రమత్తమయ్యారు. అట్లాంటిక్ మహాసముద్రం పైన హోల్డింగ్ ప్యాటర్న్‌లో విమానాన్ని ఉంచారు. సుమారు గంటన్నర తర్వాత ఆ విమానం నెవార్క్‌కు తిరిగి వచ్చింది. ఆ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
కాగా, విమానంలో సాంకేతిక సమస్య వల్ల నిప్పు రవ్వలు రాలి పడినట్లు తెలుస్తున్నది. దీంతో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ దీనిపై దర్యాప్తు చేపట్టింది. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు భిన్నంగా స్పందించారు. పాత విమానాలను ఇంకా కొనసాగిస్తుండటంపై కొందరు విమర్శించారు.
#UA149, a #United 777 experiences troubles upon its departure from #Newark Airport.
Video credit: IG | variablecraft
Read more: https://t.co/08mXl4AnEj pic.twitter.com/SEoicHPIqY
— AeroXplorer (@aeroxplorer) September 22, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

