టెక్సాస్, మే 28: ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ తయారు చేసిన స్టార్ షిప్ రాకెట్ మరోసారి పేలిపోయింది. టెక్సాస్‌లోని స్పేస్ ఎక్స్ ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ ఇలా గాల్లోనే పేలిపోవడం ఇది మూడోసారి. వరుస పేలుళ్ల తర్వాత స్పేస్ ఎక్స్ మంగళవారం సాయంత్రం తన మెగా రాకెట్ స్టార్‌షిప్‌ను మళ్లీ ప్రయోగించింది.
కానీ అంతరిక్ష నౌక అదుపుతప్పి పడిపోవడంతో ప్రధాన లక్ష్యాలను చేరుకోలేక పోయింది. సుదూర అంతరిక్ష ప్రయోగాల కోసం చేపట్టిన ఈ స్టార్‌షిప్ ప్రయోగం మరోసారి విఫలమైంది. కాగా, ప్రయోగ వైఫల్యంపై తమ బృందాలు డాటాను సమీక్షిస్తాయని, లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.