టెక్సాస్: స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ వ్యోమనౌక గురువారం అంతరిక్షంలో మళ్లీ పేలింది. టెక్సాస్ నుంచి ప్రయోగించిన కొన్ని నిమిషాలకే ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) ఫ్లోరిడాలోని కొన్ని గగనతల ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను ఆపాల్సి వచ్చింది. తాజా ప్రయోగ వైఫల్యం ఈ ఏడాది మస్క్ తలపెట్టిన రాకెట్ ప్రయోగంలో రెండవది.
స్టార్‌షిప్ శకలాలు దక్షిణ ఫ్లోరిడా, బహమాస్ దగ్గర పడిపోవడం పలు వీడియోల్లో కనిపించింది. దీంతో స్టార్‌షిప్ ప్రయోగాల్లో ఎనిమిదోదీ పేలుడు కారణంగా వైఫల్యం చెందింది. ‘ఇప్పుడు మాకు కొంత ప్రాక్టీస్ లభించింది’ అని స్పేస్ఎక్స్ ప్రతినిధి అన్నారు.