Sunita Williams | అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ విల్మోర్లు త్వరలోనే భూమికి చేరనున్నారు. వారిని తీసుకొచ్చేందుకు స్పేస్-ఎక్స్ చేపట్టిన ప్రత్యేక మిషన్ విజయవంతమైంది. స్పేస్ ఎక్స్ పంపిన క్రూ-9 (SpaceX Crew 9 ) స్పేస్‌క్రాఫ్ట్ ఐఎస్ఎస్కి చేరింది. ఈ విషయాన్ని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. డ్రాగన్ స్పేస్ స్టేషన్‌కు చేరినట్లు వెల్లడించారు. ఈ మేరకు వీడియోను పంచుకున్నారు.
Dragon has reached @Space_Station https://t.co/p0kEkJklnK
— Elon Musk (@elonmusk) September 29, 2024
కాగా, బోయింగ్ సంస్థ ఈ ఏడాది జూన్‌లో చేపట్టిన స్టార్‌లైనర్ స్పేస్ మిషన్ ద్వారా వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita Williams), బుచ్ విల్మోర్ (Butch Wilmore) ఐఎస్ఎస్కు (International Space Station) చేరుకున్న విషయం తెలిసిందే. అయితే తిరుగు ప్రయాణంలో బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపం తలెత్తటంతో ఇద్దరు వ్యోమగాములు గత 100 రోజులుగా అంతరక్షింలోనే ఉండిపోవాల్సి వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ వారిద్దరూ అంతరిక్షంలోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
వీరిని తిరిగి భూమికి తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ ప్రత్యేక మిషన్ చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ నుంచి క్రూ-9 స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి పంపింది. ఈ లాంచ్‌ప్యాడ్ నుంచి చేపట్టిన తొలి మానవ సహిత స్పేస్‌ఫ్లైట్ ఇదే. నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రాంలో భాగంగా స్పేస్-ఎక్స్ క్రూ-9 స్పేస్‌క్రాఫ్ట్‌ను ఐఎస్ఎస్కు పంపింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఫిబ్రవరి 2025లో వ్యోమగాములు భూమికి తిరిగి రానున్నారు. ఈ స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్స్ నలుగురు ప్రయాణించొచ్చు. క్రూ మిషన్ కమాండర్‌గా నాసా నిక్ హేగ్, రష్యా రాస్కోస్మోస్ మిషన్ స్పెషలిస్ట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ ఇందులో వెళ్లారు. వచ్చే సమయంలో సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‌ని తిరిగి తీసుకువచ్చేందుకు రెండు సీట్స్‌ని ఖాళీగా ఉంచారు.
Also Read..
Panther Attack | మ్యాన్ ఈటర్ పాంథర్ వరుస దాడులు.. 11 రోజుల్లో ఏడుగురు మృతి
Rhino | బైకర్‌ను వెంబడించి దాడి చేసిన ఖడ్గమృగం.. షాకింగ్ వీడియో