Southwest Airlines | కాలిఫోర్నియా (California)లోని బర్బ్యాంక్ (Burbank) నుంచి బయల్దేరిన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ (Southwest Airlines) విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో మరో విమానాన్ని ఢీకొనబోయింది. అలర్ట్‌తో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని దాదాపు 500 అడుగుల కిందకు దించారు (Flight Plunges 500 Feet). దీంతో విమానంలోని ఇద్దరు సహాయకులు గాయపడినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది.
హాకర్ హంటర్ (ఎన్335ఏఎక్స్) అనే బ్రిటిష్ ఫైటర్ జెట్ 14,653 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. అదే సమయంలో సౌత్‌వెస్ట్ విమానం 14,100 అడుగుల ఎత్తులో ఉంది. రెండు విమానాలూ దాదాపూ దగ్గరగా రావడంతో ఎయిర్ ట్రాఫిక్ అలర్ట్, కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ ద్వారా హెచ్చరికలు వచ్చాయి. ఈ అలర్ట్‌తో వేగంగా స్పందించిన పైలట్ తగిన చర్యలు తీసుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సౌత్‌వెస్ట్ పైలట్ విమానాన్ని వేగంగా 500 అడుగుల కిందకు దించారు. దీంతో విమానం కుదుపులకు లోనైంది. ఈ ఘటనతో విమానంలో గందరగోళం నెలకొంది. ఇద్దరు సహాయకులు గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం విమానం లాస్ వెగాస్‌లో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గాయపడిన సహాయకులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Also Read..
IRCTC | రైళ్లలో ఆహార నాణ్యతపై 2024-25లో 6,645 ఫిర్యాదులు.. వెల్లడించిన రైల్వే శాఖ మంత్రి
Indian Embassy | థాయ్-కంబోడియా సరిహద్దుల్లో ఘర్షణలు తీవ్రతరం.. ఇండియన్ ఎంబసీ కీలక అడ్వైజరీ
Kargil Vijay Diwas | పాక్ సైనికులపై ఫిరంగుల వర్షం.. కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం