Wildfire | దక్షిణ కొరియాలో కార్చిచ్చు (Wildfire) బీభత్సం సృష్టిస్తోంది. కార్చిచ్చులు రేపిన దావానలం కారణంగా వేల సంఖ్యలో ఇళ్లు, చెట్లు కాలి బూడిదయ్యాయి. వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. మరోవైపు ఈ కార్చిచ్చు కారణంగా 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఆరుగురు తీవ్రంగా గాయపడగా.. మరో 13 మంది స్వల్పంగా గాయపడ్డారు.
At least 12 dead in South Korea wildfires.
A massive forest fire that began in Uiseong, Gyeongbuk, has been spreading for four days, affecting Andong, Cheongsong Juwangsan National Park, Yeongyang, and Yeongdeok. The wildfire has resulted in 12 fatalities, with deaths reported… pic.twitter.com/Z6U62BAXs3
— Global Index (@TheGlobal_Index) March 25, 2025
గతవారం సౌత్ కొరియా ఆగ్నేయ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు భారీ నష్టాన్ని కలిగించింది. బలమైన గాలులు, పొడి వాతావరణం కారణంగా మంటలు కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో వేల హెక్టార్ల విస్తీర్ణంలోని అడవులు బూడిదయ్యాయి. కార్చిచ్చులను అదుపుచేసేందుకు సైన్యం సాయంతో వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది పనిచేస్తున్నారు.
ఈ కార్చిచ్చు కారణంగా పాఠశాలలను అధికారులు మూసివేశారు. వందలాది మంది ఖైదీలను జైళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు తరలించారు. మంటల్లో వందల ఏళ్ల నాటి చారిత్రాత్మక ఆలయం (Historic Temples) పూర్తిగా కాలిబూడిదైపోయింది. ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 27 వేల మందికిపైగా నివాసితులను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
1000 year old Temple consumed by wildfire
Thousand-year-old Unramsa Temple on Cheondeungsan Mountain South Korea, was completely destroyed by a forest fire yesterday. It quickly spread due to strong winds, burning down both the main building and its outbuildings.
“Before the… pic.twitter.com/X5Bk6aTjUy
— Volcaholic 🌋 (@volcaholic1) March 23, 2025
Also Read..
Japan wild fire | జపాన్‌లో కార్చిచ్చుల బీభత్సం..!
Donald Trump | ట్రంప్ మరో సంచలనం.. భారత్‌ను ఉదహరిస్తూ అమెరికా ఎన్నికల ప్రక్రియలో భారీ మార్పులు
చేయని నేరానికి 55 ఏండ్ల జైలుశిక్ష.. 12 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం