చేయని నేరానికి 55 ఏండ్ల జైలుశిక్ష.. 12 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం
మరణశిక్షపై 55 ఏళ్లకు పైగా జైలు జీవితాన్ని గడిపి గత ఏడాది నిర్దోషిగా విడుదలైన ఓ జపాను వృద్ధుడికి 14 లక్షల డాలర్ల(దాదాపు రూ.12 కోట్లు) నష్ట పరిహారాన్ని న్యాయస్థానం ప్రకటించింది. తప్పుడు కేసులో అత్యంత సుదీర్ఘ కాలం జైలు జీవితాన్ని గడిపినందుకు రోజుకు 85 డాలర్లను (దాదాపు రూ.12,300) చొప్పున నష్ట పరిహారంగా అందచేయాలని షిఝువోకా జిల్లా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
టోక్యో, మార్చి 25 : మరణశిక్షపై 55 ఏళ్లకు పైగా జైలు జీవితాన్ని గడిపి గత ఏడాది నిర్దోషిగా విడుదలైన ఓ జపాను వృద్ధుడికి 14 లక్షల డాలర్ల(దాదాపు రూ.12 కోట్లు) నష్ట పరిహారాన్ని న్యాయస్థానం ప్రకటించింది. తప్పుడు కేసులో అత్యంత సుదీర్ఘ కాలం జైలు జీవితాన్ని గడిపినందుకు రోజుకు 85 డాలర్లను (దాదాపు రూ.12,300) చొప్పున నష్ట పరిహారంగా అందచేయాలని షిఝువోకా జిల్లా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మాజీ ప్రొఫెషనల్ బాక్సర్ అయిన 89 ఏళ్ల ఇవావో హకమాటా 1968లో నలుగురు వ్యక్తుల హత్యకు సంబంధించిన కేసులో అరెస్టయ్యారు. అతనికి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. మృతుల వద్ద లభించిన రక్తపు మరకలు ఉన్న బట్టలను ప్రధాన సాక్ష్యంగా పరిగణించిన కోర్టు హకమాటాకు మరణశిక్ష విధించింది.
అయితే ఈ బట్టలను డీఎన్ఏ పరీక్షకు పంపగా వాటిని మృతదేహాల వద్ద పోలీసులే ఉంచారని బయటపడింది. దీంతో హకమాటా మరణశిక్షను కోర్టు రద్దు చేసింది. తప్పుడు కేసులో మరణశిక్షను ఎదుర్కొని అత్యంత సుదీర్ఘకాలం జైలు జీవితాన్ని గడిపిన తొలి వ్యక్తిగా హకమాటా జపాను చరిత్రలో నిలిచిపోయారు. ఆయనకు కోర్టు ప్రకటించిన నష్టపరిహారం అతి పెద్ద మొత్తమని, అయితే ఆయన కోల్పోయిన జీవితాన్ని ఏదీ భర్తీ చేయలేదని హకమాటా తరఫు న్యాయవాది హిడెయో ఓగావా వర్ణించారు. 1961లో ప్రొఫెషనల్ బాక్సర్‌గా రిటైర్ అయిన హకమాటాకు సెంట్రల్ జపాన్‌లోని షిఝువోకాలోని సోయాబీన్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో ఉద్యోగం లభించింది. రెండేళ్ల తర్వాత ఆయన యజమాని, యజమాని భార్య, వారి ఇద్దరు పిల్లలు వారి ఇంట్లో కత్తిపోట్లకు గురై మరణించారు. తన చేత పోలీసులే బలవంతంగా నేరాన్ని ఒప్పించారని ఇవావో హకమాటా వాదించాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

