Japan wild fire : జపాన్ (Japan) పశ్చిమ ప్రాంతంలో రెండు కార్చిచ్చులు (Wild fires) బీభత్సం సృష్టిస్తున్నాయి. కార్చిచ్చులు రేపిన దావానలం కారణంగా పదుల సంఖ్యలో ఇళ్లు, వేల సంఖ్యలో చెట్లు కాలి బూడిదయ్యాయి. వందల మంది ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
ఇవాహరి నగరంలోని ఎహిమ్ ప్రిఫెక్చర్‌లోని కొండవాలుపై ఉన్న చెట్లు.. కార్చిచ్చు కారణంగా కాలిపోతున్నాయి. హెలికాప్టర్ల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. మరోవైపు ఒకాయమా నగరంలో ఆదివారం చెలరేగిన మంటలతో పలు ఇళ్లు కాలి బూడిదయ్యాయి.
దాంతో ముందు జాగ్రత్తగా ప్రభావిత ప్రాంతాల్లోని నివాసితులను అధికారులు ఖాళీ చేయించారు. కార్చిచ్చును అదుపు చేసేందుకు రెస్క్యూ టీమ్స్, ఫైర్ ఫైటర్స్ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.