దక్షిణ కొరియాలో అత్యవసర పరిస్థితి
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ విధిస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు.
- ‘మార్షల్ లా’ విధించిన అధ్యక్షుడు యోల్
- విపక్షాలు ఆగ్రహం.. పార్లమెంట్ బయట నిరసన
సియోల్: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ విధిస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. పార్లమెంట్‌లోని ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. అందువల్లే దేశంలో అత్యవసర పరిస్థితి విధించాల్సి వచ్చిందని తెలిపారు. పొరుగుదేశం ఉత్తర కొరియాకు అనుకూలంగా ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను కట్టడి చేస్తున్నాయని ఆరోపించారు. దేశంలోని ఉత్తర కొరియా అనుకూల శక్తుల్ని నిర్మూలిస్తానని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని ప్రతిజ్ఞ చేశారు.
మార్షల్ లా విధింపుతో ఏర్పడే అసౌకర్యాన్ని సహనంతో భరించాలని ప్రజల్ని కోరారు. వీలైనంత తొందర్లో దేశంలో మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని చెప్పారు. కాగా, దేశంలో ‘మార్షల్ లా’ విధింపును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పార్లమెంట్ బయట నిరసనకు దిగాయి. పోలీసులు వారి నిరసనను అడ్డుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మార్షల్ లా విధింపుతో ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడానికి వీలుండదు. మీడియాపై ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ ఉంటుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

