ఒకసారి చార్జ్ చేస్తే వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణించే సోలార్ కారును ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ విద్యార్థులు రూపొందించారు. గంటకు 85 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ కారుకు ‘ది సన్ స్విఫ్ట్7’గా నామకరణం చేశారు.
ఈ కారుకు గిన్నిస్ రికార్డు కోసం దరఖాస్తు చేసుకొన్నట్టు యూనివర్సిటీ ప్రొఫెసర్ రిచర్డ్ హోప్కిన్స్ పేర్కొన్నారు.