Solar Panels | హాంగ్‌కాంగ్: సౌర విద్యుత్తు రంగంలో చైనా శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణ చేశారు. సులభంగా తయారుచేయగల కొత్త సోలార్ సెల్స్‌ను అభివృద్ధి చేశారు. సిటీ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసిన ఈ సోలార్ సెల్స్‌తో సోలార్ ప్యానళ్లను వార్తాపత్రికల్లా ముద్రించవచ్చు.
ఇవి ఇతర సోలార్ ప్యానళ్ల కంటే సమర్థంగా విద్యుత్తును ఉత్పత్తి చేయగలవని శాస్త్రవేత్త అలెక్స్ జెన్ క్వాన్యూ తెలిపారు. న్యూస్‌పేపర్‌లా ఉండే ఈ సింథటిక్ సోలార్ ప్యానళ్లను గాజు కిటికీలకు సైతం అమర్చవచ్చని, తద్వారా ఎత్తైన భవనాలు ఉండే నగరాలకు ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. త్వరలోనే పైలట్ ప్రాజెక్టుగా ఉత్పత్తిని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు.