సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాళ్లకు కచ్చా బాదమ్ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కచ్చా బాదమ్.. కచ్చా బాదమ్ అంటూ పాట పాడుతూ.. ఆ పాటకు డ్యాన్స్ వేస్తూ నెటిజన్లు సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. ఇన్‌స్టాలో అయితే ఇదే పాట తెగ ట్రెండ్ అవుతోంది.
మన దేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా కచ్చా బాదమ్ సాంగ్ క్రేజ్ పెరిగింది. టాంజానియాకు చెందిన సోషల్ మీడియా స్టార్ కిలి పాల్ తన సోదరితో కలిసి కచ్చా బాదమ్ పాటకు అదిరిపోయే స్టెప్పులేశాడు. అదరగొట్టేశాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కచ్చా బాదమ్ అనే పాట బెంగాలీ సాంగ్. పల్లీలు అమ్ముకునే భుబాన్ బద్యాకర్ అనే వ్యక్తి సైకిల్ మీద తిరుగుతూ ఈ పాట పాడుతూ ఉండేవాడు. ఒకరోజు భుబాన్ ఈ పాట పాడుతుంటే.. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టించింది. అప్పటి నుంచి భుబాన్.. సెలబ్రిటీ అయిపోయాడు. అదే పాటకు సోషల్ మీడియాలో డ్యాన్స్‌లు వేస్తూ నెటిజన్లు సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు.