లండన్: 16 ఏండ్ల లోపు పిల్లలు సామాజిక మాధ్యమ వేదికలను వాడకుండా నిషేధిస్తున్నట్టు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు. గేమింగ్, లైవ్‌స్ట్రీమింగ్ సర్వీసులపై ఆంక్షలు విధించాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నది.
ఇప్పటికే పలు దేశాలు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేశాయి.