ఇది ఒళ్లు గగుర్పొడిచే సంఘటన. టర్కీకి చెందిన విమానయాన సంస్థ ఫ్లైట్ అటెండెంట్ ఇటీవల విమానంలో భోజనం చేస్తుండగా పాము తల కనిపించింది. భోజనం సగం పూర్తి చేశాక పాము తలను చూసిన అటెండెంట్ భయపడిపోయాడు. ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. అనంతరం ఈ ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
జూలై 21న టర్కీలోని అంకారా నుంచి జర్మనీలోని డ్యూసెల్డార్ఫ్కు వెళ్తున్న సన్ ఎక్స్‌ప్రెస్ విమానంలో ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. క్యాబిన్ సిబ్బంది భోజనం చేస్తున్నారు. ఒక అటెండెంట్ భోజనం సగం పూర్తిచేశాక బంగాళదుంపలు, కూరగాయల మధ్య తెగిపడిన పాము తల కనిపించింది. ట్విటర్లో షేర్ చేసిన ఫుడ్ ట్రే మధ్యలో పాము తల స్పష్టంగా కనిపిస్తున్నది. కాగా, ఈ ఘటనపై విమానయాన సంస్థ స్పందించింది. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదని తెలిపింది. ఆహారం సరఫరా చేపే క్యాటరింగ్ సంస్థతో ఒప్పందాన్ని హోల్డ్‌లో పెట్టింది.
Severed snake head found in a Sunexpress in-flight meal.
The flight was enroute to Düsseldorf from Ankara when a cabin crew member, who had eaten most of the meal, found it.
Dead snails have previously appeared in the airline’s flight meals.
A company providing catering suspended pic.twitter.com/nAgg2wSUIK— Handy Joe (@DidThatHurt2) July 26, 2022