Terrorists | పాకిస్థాన్ సైన్యంపై ఉగ్రదాడి.. నలుగురు జవాన్లు మృతి.. సైన్యం దాడిలో ఆరుగురు ఉగ్రవాదులు హతం..!
Terrorists | పాకిస్థాన్ (Pakistan) లోని అతిపెద్ద నగరమైన కరాచీ (Karachi) లో శనివారం రాత్రి ఉగ్రవాదులు (Terrorists) దాడికి పాల్పడ్డారు. నగరంలోని సింధ్ రేంజర్ల (Sindh Rangers) స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Terrorists : పాకిస్థాన్ (Pakistan) లోని అతిపెద్ద నగరమైన కరాచీ (Karachi) లో శనివారం రాత్రి ఉగ్రవాదులు (Terrorists) దాడికి పాల్పడ్డారు. నగరంలోని సింధ్ రేంజర్ల (Sindh Rangers) స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. కరాచీలోని గులిస్తాన్-ఎ-జౌహర్ ప్రాంతంలో ఉన్న సింధ్ రేంజర్ల ప్రధాన కార్యాలయంపైకి ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో దూసుకొచ్చారు.
స్థావరాన్ని ఢీకొట్టి వాహనాన్ని పేల్చివేసిన వెంటనే మిగిలిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతాబలగాలు వెంటనే ఎదురుదాడికి దిగడంతో ఆ ప్రాంతం మొత్తం కాల్పుల మోతతో దద్దరిల్లింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు, కమాండోలను రంగంలోకి దించారు. ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ నుంచి విడిపోయిన ‘జమాత్-ఉల్-అహ్రార్’ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. పాకిస్థాన్‌లో భద్రతా బలగాలపై ఇటీవలి కాలంలో దాడులు పెరిగిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

