Brain Shrinkage | వాషింగ్టన్, మే 22 : రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేసినప్పటికీ, గంటల తరబడి కూర్చుంటే మెదడు ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆలోచనా శక్తి మందగిస్తుందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. ఎక్కువ సేపు కూర్చోవటం వల్లే మెదడు వేగంగా కుంచించుకుపోయే ప్రమాదాన్ని వృద్ధులు ఎదుర్కొంటున్నారని, జ్ఞాపకశక్తి క్షీణించే ప్రమాదముందని అమెరికాలోని ‘వాండెర్బిల్ట్ యూనివర్సిటీ’ పరిశోధకులు చెబుతున్నారు.
కూర్చొనే సమయాన్ని తగ్గించుకొని, శారీరకంగా కదిలికలు ఉండేట్టు చూసుకోవాలని అధ్యయనం సూచించింది. వారానికి 150 నిమిషాలపాటు వ్యాయామం చేస్తూ, సగటున రోజుకు 13 గంటలపాటు కూర్చొని ఉంటున్న వాళ్లను పరిశోధకులు ట్రాక్ చేశారు. వీరి మెదడు కుంచించుకుపోయిన సంగతిని గుర్తించారు. అనేక గంటలపాటు కూర్చొని ఉండటం వల్ల, మెదడుకు రక్తప్రసరణ, ఆక్సిజన్ సరఫరా తగ్గి.. మెదడు కణాలు దెబ్బతింటాయని అధ్యయనం వివరించింది.