కౌలాలంపూర్: గే సెక్స్‌పై నిషేధాన్ని సింగపూర్‌లో ఎత్తివేయనున్నారు. ఇక నుంచి ఆ దేశంలో హోమోసెక్స్ లీగల్ కానున్నది. ఈ విషయాన్ని ప్రధాని లీ సయిన్ లూంగ్ తన జాతీయ సందేశంలో పేరొన్నారు. స్వలింగ సంపర్కుల అంశంపై గత కొన్నాళ్లుగా సింగపూర్‌లో తీవ్ర చర్చ సాగుతోంది. సింగపూర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎల్జీబీటీ కార్యకర్తలు స్వాగతించారు. ఇది మానవత్వ విజయమన్నారు. సంప్రదాయ విలువలకు సింగపూర్ పట్టణం పెట్టింది పేరు. కానీ బ్రిటీష్ కాలం నాటి 377ఏ చట్టాన్ని రద్దు చేయాలని ఇటీవల డిమాండ్లు పెరిగాయి. ఆసియాలోని భారత్, తైవాన్, థాయిలాండ్ దేశాల తర్వాత.. ఎల్జీబీటీ హక్కులకు అధిక ప్రాధానత్య ఇస్తున్న దేశంగా సింగపూర్ నిలుస్తోంది. ఇద్దరు మగవారి మధ్య 377ఏ చట్టం ప్రకారం శృంగారం నిషేధం. అయితే ఆ చట్టాన్ని రద్దు చేసే యోచనలో ఉన్నట్లు ఆదివారం ప్రధాని లీ తెలిపారు. సింగపూర్ ప్రజలు దీన్ని ఆమోదిస్తారని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.