PM Lee Seen Lung | న్యూఢిల్లీ: సింగపూర్ను దాదాపు 20 ఏండ్లుగా పాలిస్తున్న ప్రధాని లీ సీన్ లూంగ్ (72) మేలో పదవి నుంచి వైదొలగబోతున్నట్టు సోమవారం ప్రకటించారు. నాయకత్వ మార్పు ఏ దేశానికైనా ముఖ్యమైన క్షణమన్నారు. ఉప ప్రధాని లారెన్స్ వాంగ్ ఆయన స్థానాన్ని భర్తీ చేయనున్నారు. లీ తన పాలనతో దేశాన్ని ఆర్థికంగా ఎంతో ముందుకు తీసుకెళ్లారు.