న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ అందరికీ తెలిసిందే. ఆ కంపెనీ సీఈవో(Siemens CEO) ఆగస్టిన్ ఎస్కోబార్.. అమెరికాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందాడు. ఆ దుర్ఘటనలో ఆయన భార్య, ముగ్గురు పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్ సిటీలో ఉన్న హడ్సన్ నదిలో గురువారం ఆ హెలికాప్టర్ కూలింది. ఈ ఘటన సీమెన్స్ కంపెనీలో విషాద ఛాయలు నింపింది. కంపెనీ సీఈవో ప్రమాదంలో మృతిచెందడంతో ఉద్యోగులు షాక్‌కు గరయ్యారు. యూరోప్‌లో ఎక్కువ రీచ్ ఉన్న కంపెనీగా సీమెన్స్ ఏజీకి పేరున్నది.
సీమెన్స్ ఏజీ కంపెనీని 1847లో స్థాపించారు. జర్మనీలోని మునిచ్‌లో దాని ప్రధాన కార్యాలయం ఉన్నది. ప్రభావంతమైన టెక్నాలజీ కంపెనీల్లో సీమెన్స్ ఏజీ కూడా ఒకటి. ఆ కంపెనీ సుమారు 175 ఏళ్ల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నది. దాదాపు 190 దేశాల్లో ఆ కంపెనీ ఆపరేట్ చేస్తున్నది. వేల సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. ఇటీవల కాలంలో డిజిటల్ టెక్నాలజీ ఆ కంపెనీ కీలక దశకు చేరుకున్నది. సాఫ్ట్వేర్, ఏఐ, డేటా సొల్యూషన్స్‌లో ఆ కంపెనీ దూసుకెళ్తున్నది.
సైట్ సీయింగ్ కోసం వెళ్లిన టూరు విషాదంగా మారింది. గురువారం మధ్యాహ్నం బెల్ 206 హెలికాప్టర్ .. హడ్సన్ నదిలో కూలింది. వాల్ స్ట్రీట్ హెలిపోర్ట్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు టేకాఫ్ తీసుకున్న ఆ హెలికాప్టర్ .. మన్‌హట్టన్ వినువీధిలో .. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దిశగా వెళ్లింది. అయితే పైకి ఎగిరిన 15 నిమిషాల్లో ఆ హెలికాప్టర్ పీయర్ 40 వద్ద హడ్సన్ నదిలో పడింది. రేడార్ డేటా ప్రకారం ఆ హెలికాప్టర్లో సాంకేతిక సమస్య వచ్చినట్లు తెలిసింది. హెలికాప్టర్‌కు చెందిన రోటర్ విభాగం విరిగినట్లు అనుమానిస్తున్నారు. దీంతో కంట్రోల్ తప్పిన చాపర్.. గింగిరాలు తిరిగింది. ఆ తర్వాత జెర్సీ సిటీ సమీపంలో నీటిలో కూలింది. ఎమర్జెన్సీ సిబ్బంది వెంటనే స్పందించినా.. దాంట్లో ఉన్న ఒక్కరు కూడా ప్రాణాలతో నిలువలేదు.