వాషింగ్టన్, అక్టోబర్ 27: అమెరికాలో ప్రభుత్వం ‘షట్‌డౌన్’లోకి వెళ్లిపోయాక ఆ దేశంలోని విమాన రాకపోకల్లో తీవ్ర జాప్యం ఏర్పడుతున్నది. ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోలర్ల కొరత కారణంగా ఆదివారం యూఎస్ అంతటా దాదాపు 8 వేలకుపైగా విమానాలు ఆలస్యంగా నడిచాయని అధికారులు తెలిపారు. పరిస్థితి ఇలాగే ఉంటే విమాన రాకపోకల్లో తీవ్ర జాప్యం, పలు సర్వీసుల రద్దు ఉంటుందని యూఎస్ రవాణా కార్యదర్శి సీన్ డఫ్ఫీ ట్రంప్ సర్కార్‌ను హెచ్చరించారు. అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ అక్టోబర్ 1 నుంచి మొదలైంది. దీంతో కొన్ని అత్యవసర సేవల విభాగాలకు మినహా.. మిగిలిన అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగుల వేతనాలు, ఇతర చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. అనేక నగరాల్లోని విమానాశ్రయాల్లో ‘ఏటీసీ’ సిబ్బంది విధులకు హాజరుకావటం లేదు.