కాలిఫోర్నియా: భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా రోదసి యాత్రకు అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఆదివారం చేపట్టాల్సిన యాక్సియం-4 మిషన్ను నాసా మళ్లీ వాయిదా వేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో రష్యాకు చెందిన సెక్షన్లో ఇటీవల మరమ్మతులు జరిగాయి. దీన్ని పరిశీలించడానికి మరింత సమయం పడుతున్నందున 22న చేపట్టాల్సిన మిషన్ను వాయిదా వేస్తున్నట్టు నాసా తెలిపింది. ఈ ప్రయోగం ఇప్పటివరకు ఆరుసార్లు వాయిదా పడింది.