మహిందా రాజపక్స అధికారిక నివాసంలో కాల్పులు
కొలంబో : శ్రీలంక మాజీ ప్రధాని మహిందా రాజపక్క అధికారిక నివాసంలో కాల్పులు చోటు చేసుకుంది. అయితే రాజపక్స నివాసాన్ని ముట్టడించేందుకు భారీ సంఖ్యలో జనాలు తరలిరావడంతో, ఆందోళనకారులను అదుపు చేసేందుకు గాల్లోకి కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. అధికారిక నివాసం గేటు వద్ద కూడా ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజపక్స అధికారిక నివాసం వద్ద వేల సంఖ్యలో బలగాలను మోహరించారు. కర్ఫ్యూ విధించినప్పటికీ దాన్ని ఆందోళనకారులు పట్టించుకోలేదు.
శ్రీలంక ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి మహింద రాజపక్స తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఫలితంగా మొత్తం మంత్రి మండలి రైద్దెంది.
అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్స పదవుల నుంచి దిగిపోవాలంటూ నెల రోజులుగా నిరసనలు తెలుపుతున్న ప్రజలు సోమవారం ఉద్యమాన్ని మరింత తీవ్రం చేశారు. కొలంబోలో అధ్యక్ష కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసనకారులపై ప్రభుత్వ మద్దతుదారులు దాడులకు తెగబడ్డారు. అనంతరం నిరసనకారులు ప్రభుత్వ మద్దతు దారులపై దాడులకు దిగారు. వారి వాహనాలకు నిప్పు పెట్టారు. ఎంపీలు, అధికార పార్టీ నేతల ఇండ్లను ముట్టడించారు. హింస కొలంబో నుంచి దేశమంతటికీ విస్తరించింది. సోమవారం ఘర్షణల్లో అధికార ఎస్ఎల్పీపీ పార్టీ ఎంపీ అమరకీర్తి సహా ముగ్గురు చనిపోయారు. 154 మందికి గాయాలయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

