Sri Lanka Violence | శ్రీలంకలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ అయ్యాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభం.. ఆహార ధాన్యాల కొరత, ఔషధాల కొరత.. భారీ ధరకు పెట్రోల్ కొనుగోలు చేయాల్సి రావడంతో శ్రీలంక వాసుల్లో ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. అధికారంలో ఉన్న రాజపక్సె కుటుంబం లక్ష్యంగా ఆందోళనకారులు నిరసనకు దిగారు.
రెండు రోజులుగా సాగిన గృహ దహనాలు. మరణాలతో దేశవ్యాప్త కర్ఫ్యూ అమల్లోకి తెచ్చారు. హింసను ప్రోత్సహించారన్న ఆరోపణలపై అరెస్ట్ చేస్తారన్న భయంతో శ్రీలంక ప్రధానిగా మహింద రాజపక్సె సోమవారం రాజీనామా చేశారు.దీంతో మహింద రాజపక్సె మద్దతుదారులు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులపై దాడులు చేశారు.
రాజపక్సె రాజీనామా తర్వాత అల్లర్లు సర్దుమణగడానికి బదులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు శ్రీలంక రక్షణశాఖ మంగళవారం కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది. రాజపక్సె ప్రధానిగా రాజీనామా చేసిన తర్వాత జరిగి ఘర్షణలో 173 మంది గాయ పడ్డారు.