Microsoft | వాషింగ్టన్ : గాజాలో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు మైక్రోసాఫ్ట్ టెక్నాలజీని అందిస్తుండటాన్ని ప్రశ్నించిన ఆ కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజినీరు తన ఉద్యోగాన్ని కోల్పోయారు. సీటెల్ కాన్ఫరెన్స్ సెంటర్లో ఇటీవల జరిగిన సమావేశంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రసంగిస్తుండగా జో లోపెజ్ గట్టిగా కేకలు వేస్తూ, ని రసన తెలిపారు. ఇజ్రాయెల్ సైన్యానికి అజ్యూర్ టెక్నాలజీని అందిస్తుండటాన్ని ప్రశ్నించారు.
ఈ టెక్నాలజీ పాలస్తీనీయులను చంపడానికి ఉపయోగపడుతుండ టంపై నిరసన తెలిపారు. దీనిని ఎలా సమర్థించు కుంటారని నిలదీశారు. “ఫ్రీ పాలస్తీనా” అని నినాదా లు చేశారు. ఆ సమయంలో సత్య వేదికపైనే కాసేపు మౌనంగా ఉండి, ఆ తర్వాత ప్రసంగాన్ని కొనసాగించారు. లోపెజ్‌ను భద్రతా సిబ్బంది బయటకు తీసుకెళ్లిపోయారు.