Shigeru Ishiba : జపాన్ (Japan) ప్రధానమంత్రి (Prime Minister) పదవికి షిగేరు ఇషిబా (Shigeru Ishiba) రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. పార్టీలో అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలనే లక్ష్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఈ విషయాన్ని జపాన్ ప్రభుత్వ రంగ టీవీ ఎన్‌హెచ్‌కే (NHK) వెల్లడించింది. జూలైలో జరిగిన ఎన్నికల్లో అధికారిక లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కూటమి పార్లమెంట్ ఎగువ సభలో మెజారిటీని కోల్పోయింది.
ఇషిబా కెరీర్ ఆరంభంలో బ్యాంకింగ్ రంగంలో పనిచేశారు. తన 29 ఏళ్ల వయసులో 1986లో తొలిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. ప్రభుత్వ విధానాలను బహిరంగంగా వ్యతిరేకిస్తూ తరచూ వార్తల్లో నిలిచేవారు. ఈ క్రమంలో కిషిద ప్రభుత్వం ఆయనను పక్కనపెట్టింది. గత ఎల్డీపీ ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగా పనిచేశారు. పార్టీ అధ్యక్ష పదవికి ఆయన ఐదుసార్లు పోటీపడ్డారు.