Asim Munir | ‘ఇరాన్‌పై ప్రేముంటే అక్కడికే వెళ్లిపోండి’.. షియా ముస్లింలకు పాక్ ఆర్మీ చీఫ్ హెచ్చరిక..!
Asim Munir : పాకిస్థాన్‌లోనూ షియాలు ఇరాన్‌పై యుద్ధాన్ని ఖండిస్తున్నారు. దాంతో, చిర్రెత్తుకొచ్చిన ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్(Asim Munir) వారిని ద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Asim Munir : పశ్చిమాసియాలో ఇరాన్‌పై ఇజ్రాయేల్, అమెరికా దాడులను ప్రపంచంలోని షియా ముస్లిం (Shia Muslims)లు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లోనూ షియా మత పెద్దలు ఇరాన్‌పై యుద్ధాన్ని ఖండిస్తున్నారు. దాంతో, చిర్రెత్తుకొచ్చిన ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్(Asim Munir) వారిని ద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఇరాన్‌ను చాలా ప్రేమిస్తున్నారా? అయితే.. షియా ముస్లింలంతా ఇరాన్ వెళ్లిపోవచ్చు’ అని షియా వర్గాన్ని ఆయన హెచ్చరించారు. మునీర్ వ్యాఖ్యలపై మత పెద్దలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ షియా ముస్లింలపై, మత పెద్దలపై మండిపడ్డారు. ఇరాన్‌పై ఇజ్రాయేల్, అమెరికా దాడులను నిరసిస్తున్న షియాలను టార్గెట్ చేసిన ఆయన.. ‘ఇరాన్‌పై అంతగా ప్రేమ ఉంటే.. ఇక్కడెందుకు ఉన్నారు. ఆ దేశమే వెళ్లిపోండి’ అని అన్నారు. మునీర్ వ్యాఖ్యలను షియా ముస్లిం మతపెద్దలు తీవ్రంగా తప్పుబట్టారు.
And then I said, I am ready to sacrifice many thousand poor Pakistani sepoys for Saudia but if you speak of Iran—move to Iran.pic.twitter.com/GdeNLyoWkQ
— Field Marshal Syed Asim Munir’s Ego (@JungjooGernail) March 21, 2026
‘అమెరికా, ఇజ్రాయేల్ తొత్తుగా మారిన అసిమ్ మునీర్ పాకిస్థాన్ ప్రయోజనాలను వ్యతిరేకంగా పని చేస్తున్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరుస్తూ దేశాన్ని నాశనం చేస్తున్నారు’ అని షియా ఉలేమా కౌన్సిల్ పాకిస్థాన్ సెంట్రల్ ఉపాధ్యక్షుడు అల్లామ సయ్యద్ సిబటెన్ హైదర్ సబ్జవారీ విమర్శించారు. పాకిస్థాన్‌ను విడిచి వెళ్లాల్సింది తాము కాదని.. అమెరికా, ఇజ్రాయేల్‌కు వంత పాడుతున్న మునీర్ వెళ్లాలని ఆయన ధ్వజమెత్తారు. ‘మీ గురువులైన అమెరికా, ఇజ్రాయేల్‌పై అమితంగా ప్రేమ ఉంటే మీరే పాకిస్థాన్‌ను వదలి వెళ్లండి’ అని అల్లామ సయ్యద్ సిబటెన్ హైదర్ సబ్జవారీ కౌంటర్ అటాక్ చేశారు.
BREAKING:
“leader of Pakistan’s Shia (Jafaria) community, responded to Asim Munir by saying: We will show you who truly stands for this country.
This came after Asim Munir reportedly told members of the Shia community to leave for Iran, suggesting they are no longer welcome.” pic.twitter.com/79RvSHanUN— Afghanistan Defense (@AFGDefense) March 20, 2026
ఇరాన్‌పై యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న షియా ముస్లింలు పాకిస్థాన్‌లో నిరసనలు తెలుపుతున్నారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని చంపడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన షియాలు మార్చి తొలివారం కరాచీలో ర్యాలీ నిర్వహించారు. అయితే.. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

